Good News: విజయవాడ – రాజమండ్రి మధ్య ప్రత్యేక MEMU రైళ్లు.. వివరాలు తెలుసుకోండి

|

Jul 30, 2022 | 5:05 PM

Special MEMU Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి - విజయవాడ మధ్య వారంలో నాలుగు ప్రత్యేక మెము రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 1 తేదీ నుంచి ఈ ప్రత్యేక మెము రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Good News: విజయవాడ - రాజమండ్రి మధ్య ప్రత్యేక MEMU రైళ్లు.. వివరాలు తెలుసుకోండి
Memu Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

MEMU Special Trains:  విజయవాడ- రాజమండ్రి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణీకులకు రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ అందించింది. ఆ మార్గంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రతి వారం నాలుగు ప్రత్యేక మెము రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 1 తేదీ నుంచి ఈ ప్రత్యేక మెము రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ నుంచి రాజమండ్రికి ప్రత్యేక మెము రైలు (నెం.07459)ను ఆగస్టు 1 తేదీ నుంచి ప్రతి వారం సోమ, మంగళవారాల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ఆ రోజున సాయంత్రం 07.15 గం.లకు విజయవాడ నుంచి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11.30 గం.లకు రాజమండ్రికి చేరుకుంటుంది.

అలాగే రాజమండ్రి నుంచి విజయవాడకు ఆగస్టు 2 తేదీ నుంచి ప్రతి మంగళ, బుధవారాల్లో ప్రత్యేక మెము రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ఆ రోజున రాజమండ్రి నుంచి వేకువజామున 03.15 గం.లకు బయలుదేరి.. అదే రోజు ఉదయం 07.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

Vijayawada – Rajahmundry Memu Train

ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ ముస్తాబాద, గన్నవరం, పెద్ద అవుటపల్లి, తెలప్రోలు, నూజివీడు, వట్లూర్, పవర్‌పేట్, ఏటూరు, చేబ్రోలు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ బై-వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి