200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

చాలా మంది గబ్బిలాలను చూస్తేనే భయపడిపోతుంటారు. వాటి రూపం, రంగు చూసి అసయ్యించుకుంటారు. కొందరైతే ఏకంగా వాటిని ఆశుభ పక్షులుగా భావిస్తారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలంతా తమ గ్రామంలోని గబ్చిలాలను దైవంగా భావిస్తారు. ఇంతకూ దీని వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?
Sacred Bats Of Gonupalli

Edited By:

Updated on: Aug 07, 2026 | 6:47 PM

సినిమాల్లో చూపించే కొన్ని అరుదైన కట్టుబాట్లు, నమ్మశక్యం కాని పనులు, సైన్స్ అందుకోలేని ఆధ్యాత్మిక నమ్మకాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులోనూ మూగజీవులను దైవస్వరూపాలుగా ఆరాధించే సాంప్రదాయం మన పల్లెల్లో నేటికీ సజీవంగా ఉంది. దానికి సజీవ సాక్ష్యమే నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గోనుపల్లి గ్రామం. ఈ గ్రామంలోని తూర్పు వీధిలో నివసించే కబోధ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే చూడటం లేదు.. వాటిని గ్రామ దేవతలుగా, తమను కాపాడే కంటి పాపలుగా ఆరాధిస్తున్నారు.

200 ఏళ్లు రక్షణ కవచంలా 

సుమారు 200 ఏళ్లు ఈ పక్షులే తమ గ్రామానికి రక్షణగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కబోధ పక్షులు గత 200 సంవత్సరాలుగా ఈ గ్రామంలోనే నివాసముంటున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఇవి గ్రామానికి ఒక రక్షణ కవచంలా నిలిచాయని ప్రజల నమ్మకం. చివరికి భయానక కరోనా కష్టకాలంలో కూడా గ్రామానికి ఎలాంటి ఆపదా రాకుండా ఈ దైవ పక్షులే తమను కాపాడాయని గోనుపల్లి ప్రజలు భక్తిప్రపత్తులతో విశ్వసిస్తున్నారు.

గబ్చిలాల అరుపే అలారం

ఈ పక్షులు నేలపై నిలబడవు. నిరంతరం కాళ్లతో చెట్టు కొమ్మలను పట్టుకుని తలకిందులుగా వేలాడుతుంటాయి. ఆహారం తీసుకోవడం, వ్యర్థాలను విసర్జించడం రెండూ నోటి ద్వారానూ జరుగుతాయని స్థానికులు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు గ్రామస్తులను తమ శబ్దాలతో నిద్రలేపే ఈ పక్షులు, సాయంత్రం 6 గంటలు కాగానే, ఆహారం కోసం చెట్టును వదిలి వెళ్తాయి. గోనుపల్లి వీధుల్లో ఈ పక్షుల సందడి, వాటి శబ్దాలే అక్కడి ప్రజల ఉదయపు అలారం. శతాబ్దాలు మారుతున్నా తరతరాల నాటి నమ్మకం చెక్కుచెదరకుండా కొనసాగుతుండటం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us