Gold Diamond jewelry Seized: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా సాధారణ తనఖీల్లో పోలీసులు భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తరలిస్తున్న బంగారం, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. దీనిలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను పోలీసులు గుర్తించారు. ఆ సొత్తుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోని సీజ్ చేశారు. దీంతోపాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ బంగారు వజ్రాభరణాలను హైదరాబాద్ నుంచి తమిళనాడులోని మధురై తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వెంటనే ఇద్దరని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ బంగారు అభరణాలు ఎవరికి సంబంధించినవి.. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. గత శనివారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ బస్సులో కూడా పెద్ద ఎత్తున బంగారం, నగదు లభించింది. పోలీసులు బస్సును ఆపి తనిఖీ నిర్వహించగా.. అందులో రూ.3 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం లభించింది. పట్టుబడిన నగదు చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీకి చెందినదిగా, బంగారం హైదరబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్‌నకు చెందినదిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Also Read: