West Godavari district: దొంగతనాలు చేయడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. కొందరు దొంగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడితే.. మరికొందరు బాధితులకు తెలియకుండానే వారి వద్ద నగదు డబ్బు దోచేసి ఉడాయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ దొంగ చాకచక్యంగా తన తెలివితేటలను ఉపయోగించి చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. తన కళ్ళముందే మెడలోని బంగారు గొలుసును దొచుకెళ్లాడు ఓ దొంగ. అయితే.. వెంటనే తేరుకున్న ఆమె లబోదిబోమని ఏడవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరవుతోంది. ఈ దొంగతనం ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తీవ్ర కలకలం సృష్టించింది. కొవ్వూరు గౌతమినగర్లో చింతలపూడి వెంకట మహాలక్ష్మి అనే మహిళ కిరాణా వ్యాపారంతోపాటు మిల్క్ డెయిరీ నిర్వహిస్తుoది. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్ పై షాప్ వద్దకు వచ్చి ఐస్ క్రీం కావాలంటూ మహాలక్ష్మిని అడిగారు.
దీంతో ఆమె పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఐస్ క్రీమ్ తీస్తున్న సమయంలో.. ఆ దొంగలు వెనకనే వచ్చి మహాలక్ష్మి మెడలో ఉన్న సుమారు 5 కాసుల బంగారు గొలుసుని లాక్కుని వెంటనే బైక్ పై పారిపోయారు. అక్కడ ఏం జరిగిందో మహాలక్ష్మికి తెలిసేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. వెంటనే ఆమె కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఏడుస్తూ చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు మహాలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Fact Check: ఏపీ ప్రజలకు వైఎస్ భారతి లేఖ రాశారా..? ఇందులో నిజమెంత..
Milk Side Effects: ఈ వ్యక్తులు అస్సలు పాలు తాగకూడదు.. పాలు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసుకోండి..