అంతా ఈ ఆటోలోనే జరిగింది.. కాలేజీ రోడ్డులో ప్రయాణం.. పోలీసుల దర్యాప్తు..

గుంటూరులో వ్యాపార నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఉన్న బంగారు బిస్కెట్, మెడలోని చైన్‎ను ఆయకు తెలియకుండా అపహరించారు దుండగులు. దీనిపై ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరులోని హిందూ కళాశాల కూడలి.. వచ్చి పోయే వారితో రద్దీగా ఉంటుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పూర్ణచంద్రరావు అప్పుడే బస్సు దిగారు.

అంతా ఈ ఆటోలోనే జరిగింది.. కాలేజీ రోడ్డులో ప్రయాణం.. పోలీసుల దర్యాప్తు..
Guntur

Edited By: Srikar T

Updated on: Jun 23, 2024 | 4:43 PM

గుంటూరులో వ్యాపార నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఉన్న బంగారు బిస్కెట్, మెడలోని చైన్‎ను ఆయకు తెలియకుండా అపహరించారు దుండగులు. దీనిపై ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరులోని హిందూ కళాశాల కూడలి.. వచ్చి పోయే వారితో రద్దీగా ఉంటుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పూర్ణచంద్రరావు అప్పుడే బస్సు దిగారు. అక్కడ నుండి శంకర్ విలాస్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. హిందూ కళాశాల కూడలిలో ఉన్న ఆటో వద్దకు వచ్చారు. పూర్ణచంద్రరావు వద్ద ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో అప్పటికే ఇద్దరూ కూర్చొని ఉన్నారు. డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలని పూర్ణచంద్రరావుని అడిగాడు. శంకర్ విలాస్ అని చెప్పగానే అటే వెలుతున్నాం అని చెప్పి ఆటో ఎక్కించుకొని ఇద్దరు ప్రయాణీకుల మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నుండి శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ ఎక్కే వరకూ ఆటో వచ్చింది. వెంటనే డ్రైవర్‎ను పోలీసులు తనిఖీలు చేశారు. అప్పుడు ఆటో డ్రైవర్ తాను శంకర్ విలాస్ రాను అంటూ పూర్ణచంద్రరావుకి చెప్పి ఫ్లై ఓవర్ పక్క రోడ్డులో దింపేశాడు.

అయితే పూర్ణచంద్రరావు వేరే ఆటో ఎక్కుదాం అనుకుని కొద్దీ దూరం వచ్చాడు. ఎందుకో అనుమానం వచ్చిన తన జేబులు తడిమి చూసుకున్నాడు. అతని జేబులో ఉండాల్సిన 37 గ్రామాలు బంగారు బిస్కెట్, తన మెడలో ఉండాల్సిన పది గ్రాముల బంగారు గొలుసు లేవని తెలుసుకున్నాడు. ఇదంతా ఆటో డ్రైవర్, అతని స్నేహితులు కలిసి చేసిన మోసంగా గుర్తించాడు. వెంటనే నగరం పాలెం పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పిడుగురాళ్లలో బంగారు షాపు నిర్వహించే పూర్ణచంద్రరావు విజయవాడలో ఆభరణాలు తయారు చేసే వ్యక్తితో మాట్లాడానికి గుంటూరు వచ్చారు. ఈక్రమంలోనే బంగారు బిస్కెట్ తన వెంట తెచ్చుకున్నారు. శంకర్ విలాస్‎లో అతనితో మాట్లాడటానికి వెలుతుండగానే దొంగల ముఠా పసిగట్టి దోచుకున్నారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అందులో భాగంగా సిసి కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…