పరవళ్లు తొక్కుతున్న గోదావరి
గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 80 వేళ క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం కాపర్ డ్యాం తూర్పుగోదావరి వైపు 300 మీటర్లు, పశ్చిమ గోదావరి వైపు మరో 300 మీటర్లు ఖాళీని వదిలారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. అయితే ఈ కాపర్ డ్యాం మార్గానికి చేరుకునే రోడ్డు.. మాత్రం నీటమునిగింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం […]
గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 80 వేళ క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం కాపర్ డ్యాం తూర్పుగోదావరి వైపు 300 మీటర్లు, పశ్చిమ గోదావరి వైపు మరో 300 మీటర్లు ఖాళీని వదిలారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది.
అయితే ఈ కాపర్ డ్యాం మార్గానికి చేరుకునే రోడ్డు.. మాత్రం నీటమునిగింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం 6.34 మీటర్ల వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. అయితే ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడికాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. మొత్తం 23 పంపుల నుంచి 8,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో పరవళ్లు తొక్కుతూ గోదావరి వరదనీరు పట్టిసీమ ద్వారా ప్రవహిస్తోంది.
గోదావరి వరదతో పట్టిసీమ పరవళ్లు తొక్కడంతో పర్యాటకుల సందడి పెరిగింది.పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. దీంతో పట్టిసీమ ప్రాంతం సందడిగా మారింది.