Tuni: పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్.. పెంపుడు శునకం మృతిపై ఫోరెన్సిక్ రిపోర్ట్..

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఆమె పెంపుడు శునకం అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించాయి. చిన్నారి మాయమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో శునకం బలహీనపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి తల్లి భవాని తీవ్ర ఆందోళనతో అనారోగ్యానికి గురయ్యారు.

Tuni: పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్.. పెంపుడు శునకం మృతిపై ఫోరెన్సిక్ రిపోర్ట్..
Gnaneshwari Missing Case

Updated on: Jun 27, 2026 | 8:17 AM

కాకినాడ జిల్లా తుని మండలం సి.హెచ్. అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా భావించిన పెంపుడు శునకం అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించాయి. ఈ నెల 6వ తేదీన పాపతో పాటు మాయమైన ఈ శునకం, మూడు రోజుల తర్వాత 9వ తేదీన తోటలోని తమ నివాసం వద్దకు వచ్చి ఆందోళనతో తిరిగి వెళ్లిపోయింది. అధికారులు 10వ తేదీ రాత్రి డ్యాగ్‌ క్యాచర్ బృందంతో అతి కష్టం మీద దాన్ని పట్టుకున్నారు. విశ్రాంతి, ఆహారం అందించిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు. వైద్యులు, పోలీసుల పర్యవేక్షణలో 12వ తేదీన జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి దాన్ని బయటకు వదిలారు. సుమారు 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత, మరుసటి రోజు 13వ తేదీ మధ్యాహ్నం శునకం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. 14వ తేదీన పోస్టుమార్టం నిర్వహించి, శరీర భాగాల నమూనాలను విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

నివేదికల ప్రకారం, చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురై శునకం మరణించినట్లు వైద్యులు, పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయి విచారణతో పాటు సాంకేతిక ఆధారాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. చిన్నారి అదృశ్యమై 20 రోజులు దాటడంతో తల్లి భవాని ఆందోళనతో అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

కాకినాడ జిల్లా తుని పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో 21 రోజుల క్రితం రెండున్నరేళ్ల జాహ్నవి కనిపించకుండా పోయింది. అప్పటినుంచి వివిధ డిపార్ట్‌మెంట్ల అధికారులు టీమ్‌లుగా విడిపోయి గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున అధికారులను రంగంలోకి దించినా… అత్యాధునిక డ్రోన్ల సాయంతో సెర్చింగ్‌ నిర్వహిస్తున్నా పాప జాడ దొరకట్లేదు.. పాప మిస్సయిన జీడిమామిడి తోటతోపాటు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాన్ని సైతం జల్లెడ పడుతున్నారు. ఏ ఒక్క క్లూని వదిలిపెట్టకుండా అధికారులు గాలిస్తున్నారు. అదేసమయంలో.. సాంకేతిక ఆధారాలతోనూ వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నా.. చిన్నారి మిస్సింగ్‌పై ఏ క్లూ దొరక్కపోవడం అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us