Andhra Pradesh: మాటలకందని విషాదం.. క్షణికావేశం.. రెండు ప్రాణాలు.. కారణం ఏంటో తెలుసా..?
విశాఖలో రెండు వేరువేరు ఘటనలు.. రెండూ ప్రేమ వ్యవహారాలే.. రెండూ ఆత్మహత్యలే.. ఒక ఘటనలో యువతి, మరొక ఘటనలో యువకుడు..! కారణాలు వేరు వేరు. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు రెండు వేరు వేరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కాలం మారిపోతుంది.. బంధాలు, ఆప్తులు దూరమైపోతున్నారు. దీంతో మనసులో మాట భావం పంచుకునేందుకు కూడా భయపడుతున్న రోజులు ఇవి. చెబితే తన మాట ఎవరు వింటారో వినరో.. ఏమనుకుంటారో అని భయం.

విశాఖలో రెండు వేరువేరు ఘటనలు.. రెండూ ప్రేమ వ్యవహారాలే.. రెండూ ఆత్మహత్యలే.. ఒక ఘటనలో యువతి, మరొక ఘటనలో యువకుడు..! కారణాలు వేరు వేరు. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు రెండు వేరు వేరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కాలం మారిపోతుంది.. బంధాలు, ఆప్తులు దూరమైపోతున్నారు. దీంతో మనసులో మాట భావం పంచుకునేందుకు కూడా భయపడుతున్న రోజులు ఇవి. చెబితే తన మాట ఎవరు వింటారో వినరో.. ఏమనుకుంటారో అని భయం. ఇంట్లో వారికి కాకపోతే బయటి వారికి ఎలా చెప్పుకునేది. తమ బాధ పంచుకునేందుకు ఎవరూ లేకుండా అయిపోతున్నారా..? అన్న బెంగ.. ఇవన్నీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అందులోనూ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. క్షణికావేశంలో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విశాఖలో వెలుగులోకి వచ్చిన రెండు వేరువేరు ఘటనలు తీవ్ర ఆవేదన నింపాయి. ప్రేమించిన యువతి పట్టించుకోలేదని యువకుడు బలవన్మరణానికి పాల్పడితే.. ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక మరో యువతి ఆత్మహత్య చేసుకుంది.
వేధింపులతో..
అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన కృష్ణారావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉపాధి కోసం విశాఖ వచ్చేసాడు. 20 ఏళ్లుగా తాపీ మేస్త్రి చేసుకుంటూ విశాఖలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. కృష్ణారావుకు భార్య ఇద్దరు పిల్లలు. చిన్న కుమార్తె శ్రావణి తులసి ఇంటర్ చదువుతుంది. తులసిని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన యువకుడు కొంతకాలంగా వెంటపడుతూ వేధిస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి యువకుడిని పిలిచి మందలించాడు. అయినా ఆ యువకుడు తిరలో మార్పు లేదు. తీవ్ర మహాస్థాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోతిన మల్లయ్య పాలెం పోలీసులు.. వేధిస్తున్న యువకుడ్ని పట్టుకున్నారు. క్షణికావేశంలో యువతి తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలో ముంచింది.
ప్రేమను తిరస్కరించిందని..
మరోవైవు గాజువాక చిన్న గంట్యాడ ప్రాంతానికి చెందిన భాస్కరరావు అలియాస్ బాబి అనే 24 ఏళ్ల యువకుడు.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బాబి ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కానీ అది వన్ సైడ్ లవ్. తన ప్రేమ గురించి ఆ యువతకి చెప్పుకున్న.. తనకున్న పరిస్థితుల దృశ్య ఆమె పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మానసికంగా కుంగిపోయిన బాబి ఈనెల 12న విషం తాగేశాడు. అపస్మరక స్థితికి వెళ్లిన భాస్కరరావును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు బాబి. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సకాలంలో కౌన్సిలింగ్ ఇవ్వాలి..
రెండు ఘటనల్లో ప్రేమ వ్యవహారాలే కారణం అయినప్పటికీ మానసికంగా కుంగిపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆయా కుటుంబాలకు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. అయితే పిల్లల ప్రకటనలో మార్పు వచ్చినప్పుడు పెద్దలు కౌన్సిలింగ్ చేయాలని సూచిస్తున్నారు సైకాలజీ నిపుణులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..