Araku Valley Coffee: అరకువేలీ కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్.. మరింత ధర లభించే అవకాశం ఉందని గిరిజనులు హర్షం..

|

May 26, 2023 | 11:18 AM

ఎన్‌పీఓపీ సర్టిఫికెట్‌ను పొందేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సర్టిఫికేషన్ వలన గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ , మిరియాలకు మరింత అధిక ధర లభించే ఆస్కారం కలుగుతుంది. తద్వారా ఈ కాఫీ రైతులకు ఆర్థిక లబ్ది చేకూరుతుందన్న జీ సీ సీ రైతులను అభినందించింది.

Araku Valley Coffee: అరకువేలీ కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్.. మరింత ధర లభించే అవకాశం ఉందని గిరిజనులు హర్షం..
Araku Valley Coffee
Follow us on

ఆంధ్రా ఊటీ అరకు కాఫీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అరకు వ్యాలీ ఏజెన్సీ లో గిరిజనులు పండిస్తున్న కాఫీ గింజలు, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అపెడా, గిరిజన సహకార సంస్థకు కాఫీ విషయంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి డివిజన్ పరిధిలో గల గొందిపాకలు, లంబసింగి , కప్పాలు క్లస్టర్లకు గాను 1300 మందికి పైగా గిరిజన రైతులు సుమారు 21వేల‌ 104 ఎకరాలలో పండిస్తున్న కాఫీ మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది. ఎన్‌పీఓపీ సర్టిఫికెట్‌ను పొందేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సర్టిఫికేషన్ వలన గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ , మిరియాలకు మరింత అధిక ధర లభించే ఆస్కారం కలుగుతుంది. తద్వారా ఈ కాఫీ రైతులకు ఆర్థిక లబ్ది చేకూరుతుందన్న జీ సీ సీ రైతులను అభినందించింది. GCC అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడంలో సహకరించిన గిరిజన కాఫీ రైతులకు, గిరిజన వికాస స్వచ్చంద సంస్థ (NGO)కి GCC MD ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు GK వీధి, పెదవలస, యర్రచెరువులు క్లస్టర్ల నుండి సేకరించిన కాఫీ గింజలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లస్టర్లలో 1,300 మంది కాఫీ రైతులు ఉండగా, 3,393.78 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. జనవరి 2024 నాటికి ఈ క్లస్టర్‌లకు ఆర్గానిక్ సర్టిఫికేట్ లభిస్తుందని తాము ఆశిస్తున్నాము” అని జిసిసి వైస్-ఛైర్మన్ మరియు ఎండి జి. సురేష్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..