Andhra Pradesh: ప్రధాని పర్యటనలో నల్లబెలూన్లు.. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

|

Jul 04, 2022 | 11:43 PM

ప్రధాని మోదీ టూర్ లో నల్లబెలూన్లు ఎగురవేసిన నిందితులను గన్నవరం (Gannavaram) పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నల్లబెలూన్ లతో నిరసన తెలిపేందకు వెళ్తున్న కాంగ్రెస్ నేత సుంకర పద్మను సైతం...

Andhra Pradesh: ప్రధాని పర్యటనలో నల్లబెలూన్లు.. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
Gannavaram
Follow us on
ప్రధాని మోదీ టూర్ లో నల్లబెలూన్లు ఎగురవేసిన నిందితులను గన్నవరం (Gannavaram) పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నల్లబెలూన్ లతో నిరసన తెలిపేందకు వెళ్తున్న కాంగ్రెస్ నేత సుంకర పద్మను సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ ఏపీ టూర్‌లో (PM Modi Tour) నల్ల బెలూన్లు కలకలం సృష్టించాయి. ప్రధాని మోదీ టూర్ లో నల్లబెలూన్ లను ఎగురవేసిన నిందితులను గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. బాలు, రాజశేఖర్, గోపి, రాజీవ్ రతన్, కిరణ్,  బేగ్ లు మోదీ టూర్ లో నల్లబెలూన్ లను ఎగరవేసి నిరసన తెలిపినట్లు గుర్తించారు. ఆరుగురు నిందితుల్లో ఒక్క రాజీవ్ రతన్ మినహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నల్ల బెలూన్ లతో నిరసన తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత సుంకర పద్మను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలోని కేసరపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనంపై నుంచి ఆరుగురు వ్యక్తులు నల్ల బెలూన్ లను ఎగరవేసినట్లు పోలీసులు విచారనలో తేలింది.
అల్లూరి సీతారామారాజు 125వ జయంతి ఉత్సవాలను పురష్కరించుకొని భీమవరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు నల్లబెలూన్ ను ఆ పార్టీ నేతలు ఎగరవేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం వెళ్తున్న సమయంలో మోదీ ప్రయాణిస్తున్న చాపర్‌కు దగ్గరకు నల్లబెలూన్లు వెళ్లాయి. దీంతో ప్రధాని టూర్‌లో భద్రతా వైఫల్యాలను బయటపెట్టాయి. మోదీ భద్రతను పర్యవేక్షించే ఎస్పీ్జీ ఈ ఘటనపై చాలా సీరియస్‌గా స్పందించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర పోలీసుల్ని ఆదేశించడంతో నిందితులను అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు.
ఏపీ వార్తల కోసం