Visakhapatnam: మన్యంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు.. కూరగాయల మాటున గంజాయి తరలింపు..

|

Oct 29, 2021 | 9:21 AM

Visakhapatnam: గంజాయి స్మగ్లింగ్ పై ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. మరోవైపు స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పని తాము చేసుకుపోతామంటూ

Visakhapatnam: మన్యంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు.. కూరగాయల మాటున గంజాయి తరలింపు..
Ganja
Follow us on

Visakhapatnam: గంజాయి స్మగ్లింగ్ పై ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. మరోవైపు స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పని తాము చేసుకుపోతామంటూ యధాతధంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో సఫలం కావడం లేదు. గత 15 రోజుల వ్యవధిలో గమనించినట్లయితే.. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో రోజూ ఎక్కడోచోట కేసు నమోదు అవుతూనే ఉంది. కొయ్యూరు మండలం తురబాల గెడ్డ సమీపంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వ్యాన్‌లో తరలిస్తున్న 400 కిలోల గంజాయి పట్టుబడింది. కూరగాయల మాటున వీటిని రవాణా చేస్తుండగా అధికారులు తనిఖీలు చేసి మరీ పట్టుకున్నారు.

వ్యాన్ కు ఫాలోవర్స్ గా రెండు మోటార్ సైకిల్స్ పై వస్తున్న ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ గంజాయి చింతపల్లి మండలం, లోతుగెడ్డ జంక్షన్ లో లోడ్ చేసి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిందితులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కాకినాడకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన ఒకరు, చింతపల్లి కి చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు బైక్స్, వ్యాన్, గ౦జాయిని సీజ్ చేశారు. ఈ గంజాయి తరలింపు వ్యవహారంలో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు.

Also read:

Andhra Pradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లుకు ఓకే చెప్పేనా..!

ఇంట్లో నాగు పాము.. నాగుపాము బుస కొడితే ఇలా ఉంటుందా.. వీడియో

WI vs BAN T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న బంగ్లా, వెస్టిండీస్.. ఓడితే సెమీస్ కష్టమే..!