AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పుష్పను మించిపోయాడు.. పోలీసులకే సవాల్ విసిరాడు.. సీన్ కట్ చేస్తే.!

డైరెక్టర్ సుమార్‌ దర్శకత్వానా, హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 మూవీ ఎంత భారీ హిట్‌కొట్టిందో అందరికీ తెలిసింది. సినిమాతో పాటు అందులోని డైలాగ్స్‌ కూడా అంతే పాపులర్‌ అయ్యాయి. అయితే సినిమా డైలాగ్స్‌ను.. సినిమా వరకే వదిలేస్తే ఓకే.. కానీ కొందరు పోకిరీలు మాత్రం ఈ సినిమా డైలాగ్స్‌ను ఎక్కడ పడితే అక్కడ వాడి ప్రజలతో పాటు అధికారులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు.. రప్పా రప్పా నరికేస్తామని ప్లకార్డులు పెట్టి ఒకడు హడావుడి చేస్తుంటే, దమ్ముంటే పట్టుకోరా షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ మరొకడు పోలీసులకు సవాల్ విసిరుతున్నాడు.

Andhra News: పుష్పను మించిపోయాడు.. పోలీసులకే సవాల్ విసిరాడు.. సీన్ కట్ చేస్తే.!
Ganja Gang
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jun 25, 2025 | 7:34 PM

Share

దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్‌ చేసిన పుష్ప సినిమాలోని డైలాగ్స్‌ ఎంత పాపులర్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలలాగా రప్పా రప్పా నరుకుతామని ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ చేత డైరెక్టర్ సుకుమార్ చెప్పించిన డైలాగ్స్‌ అయితే ఏకంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమా డైలాగ్స్‌ను.. సినిమా వరకే వదిలేస్తే ఓకే.. కానీ కొందరు పోకిరీలు మాత్రం ఈ సినిమా డైలాగ్స్‌ను ఎక్కడ పడితే అక్కడ వాడి ప్రజలతో పాటు అధికారులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇలానే ఈ మధ్య మాజీ సీఎం పర్యటన సందర్భంగా ఈ సినిమా డైలాగ్స్‌తో ఫ్లె్క్సీ ప్రదర్శించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. తాజాగా మరికొందరు యువకులు కూడా ఇదే సినిమా డైలాగ్స్‌తో రెచ్చిపోయారు.

అనంతపురం కేంద్రానికి చెందిన కొందరు యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి, గంజాయి మత్తులో అరాచకాలు సృష్టిస్తున్నారు. స్థానికులపై దాడులు చేస్తూ ఆ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి భయాందోళనలకు గురిచేస్తున్నారు. పుష్ఫ సినిమాలోని డైలాగ్స్‌తో ఏకంగా పోలీస్ స్టేషన్ ముందుకే వచ్చి దమ్ముంటే పట్టుకోరా షకావత్తు.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ రీల్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

ఇక వీరి చిల్లర చేష్టలతో విసిగిపోయిన పోలీసులు వారి ఆగడాలకు చెక్‌పెట్టేందుకు రంగంలోకి దిగారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడకొడితే ఏం జరుగుతుందో సరిగ్గా అలాగే టాటూ చరణ్, అతని గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్‌లో వేశారు. టాటూ చరణ్, అతని స్నేహితుడు పవన్‌లపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇదే కాకుండా వారిని నగర బహిష్కరణ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..