
మదనపల్లె, డిసెంబర్ 26: మదనపల్లి మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్లముందు ఆడుకుంటున్న బిడ్డ ఉన్నట్లుండి విగత జీవిగా మారాడు. తల్లి కాస్త ఏమరుపాటుగా ఉన్న సమయంలో పిల్లాడు అనుకోకుండా నీటిసంపులో పడి దీంతో కన్నోళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాలూక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
చిత్తూరు జిల్లా సోమలకు చెందిన జ్యోతిప్రకాష్ గత రెండేళ్లుగా మదనపల్లె మండలం, వలసపల్లి వద్ద ఓ మామిడి తోటకు కాపలాగా ఉంటున్నారు. భార్య, నాలుగేళ్ల కుమారుడు విక్రాంత్‌తో పాటు అక్కడే కాపాలా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న విక్రాంత్ (4) సమీపంలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. కళ్ల ముందు అప్పటి వరకు ఆడుకుంటూ అల్లరి చేసిన పిల్లాడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బంగారం లాంటి మగ బిడ్డ నీటి తొట్టిలో పడి చని పోవడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.