Vikram Reddy: ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపు ఖరారు.. రేపు సీఎం జగన్ ప్రకటించే ఛాన్స్!

|

Apr 27, 2022 | 5:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన గురువారం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.

Vikram Reddy: ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపు ఖరారు.. రేపు సీఎం జగన్ ప్రకటించే ఛాన్స్!
Mekapati Vikram Reddy
Follow us on

Mekapati Vikram Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన గురువారం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. దివంగత మంత్రి గౌత‌మ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికపై వీరిద్దరూ చర్చించనున్నారు. ఎన్నికల బ‌రిలో పార్టీ అభ్యర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్రమ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీటును గౌత‌మ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయ‌న సోద‌రుడికి అవ‌కాశం ఇద్దామ‌ని మేక‌పాటి కుటుంబసభ్యులు ఇటీవ‌లే నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విష‌యాన్ని సీఎం జగన్‌కు వివరించి, ఆత్మకూరు ఉప ఎన్నిక‌లో పార్టీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి పేరును ఖ‌రారు చేయించే దిశ‌గా మేక‌పాటి రాజమోహన్‌రెడ్డి కీల‌క చ‌ర్చలు జ‌ర‌పనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, మేక‌పాటి ప్రతిపాద‌న‌కు సీఎం జగన్ ఇప్పటికే సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టుగా వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతా భావిస్తున్నారు.

ఇదిలావుంటే, మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయాన దివంగత మంత్రి గౌతంరెడ్డి సోదరుడు.. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక, గౌతమ్ రెడ్డిలాగే విక్రమ్ రెడ్డికి కూడా మృదువుగా మాట్లాడతారనే పేరు ఉంది. ఇప్పుడు అన్న గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని సింహాపురిలో కొనసాగించేందుకు విక్రమ్ రెడ్డి రెడీ అయ్యారు.

Read Also….  AP CM Jagan: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్