
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యా్ణ్ రాజకీయాల్లో పవర్ లేని స్టార్ అన్న ఆయన.. స్థాయికి మించి మాట్లాడుతున్నారని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ గెలవదు…శాసనం అని చెప్పిన మాటలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు గేటు కూడా తాకనివ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ కాలి అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటారన్న ఆరోపించారు. పవణ్ కళ్యాణ్ ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెలంపల్లి. మరోవైపు.. సత్తెనపల్లిలో పవన్ పర్యటన సందర్భంగా డైలాగ్ వార్ నెలకొంది. మంత్రి అంబటి రాంబాబుపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తానేం వారానికోసారి వచ్చి పోయే వాడ్ని కాననీ చెప్పారు. స్థానిక మంత్రి అంబటి లాగా.. రైతుల దగ్గర లంచాలు తీసుకోనని విమర్శించారు.
కాగా.. సత్తెనపల్లిలో నిర్వహించిన కౌలు భరోసా యాత్రలో వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్. వైసీపీని గెలవనివ్వను.. ఓట్లు గెలవనివ్వను అని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తనకు కులమతాల పట్టింపులు లేవన్న పనవ్.. క్షేత్ర స్థాయి పరిస్థితుల కారణంగా కులాల గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతం కావాలని చెప్పారు. అధికార, ప్రతిపక్షాలకు వేర్వేరు నిబంధనలు ఉండవని గుర్తు పెట్టుకోవాని పోలీసులకు హితవు పలికారు.
అంబటి రాంబాబుపై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన అవినీతి పనులు, తీరు మీదనే కోపం. ముందు పోలవరం పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. వారాహిలో ఏపీ రోడ్లపై తిరిగి, ఎన్నికల ప్రచారం చేస్తా.. ఎవరాపుతారో చూస్తా. వచ్చే ఎన్నికల్లో అధికారం దూరమవుతుందని వైసీపీ నేతలకు కూడా తెలుసు. దీంతో వారు ఎన్నో ఘోరాలు చేస్తారు. జనసేన నాయకులు భయపడకుండా బలంగా పోరాడాలి.
– పవన్ కల్యాణ్, జనసేన అధినేత
మరిన్ని ఏపీ వార్తల కోసం..