Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. వ్యక్తిగత పూచీకత్తుతో మంజూరు

|

May 11, 2022 | 6:19 AM

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి అరెస్టైన మాజీ మంత్రి నారాయణకు(Former Minister Narayana) బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనా రాణి బెయిల్‌ మంజూరు చేశారు....

Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. వ్యక్తిగత పూచీకత్తుతో మంజూరు
P Narayana
Follow us on

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి అరెస్టైన మాజీ మంత్రి నారాయణకు(Former Minister Narayana) బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనా రాణి బెయిల్‌ మంజూరు చేశారు. పదో తరగతి క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారంటూ నిన్న చిత్తూరు పోలీసులు నారాయణను చిత్తూరు(Chittoor) జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల కోసం నారాయణను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేశారని, ఆయన తరఫు న్యాయవాదులు ఆధారాలు చూపించారు. వారి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మేవిధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 18లోగా రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

punjab blast update: ఇంటెలిజెన్స్‌ కార్యాలయంపై రాకెట్‌ దాడి.. బయటపడ్డ పాక్ ప్రమేయం..!

Viral Video: రోడ్డును దాటేందుకు వృద్ధురాలి ఇక్కట్లు.. యువకుడు చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు..