Andra Pradesh: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్.. ఆయన స్థాయి పెరిగిందంటూ..

ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Andra Pradesh: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్.. ఆయన స్థాయి పెరిగిందంటూ..

Updated on: Aug 22, 2022 | 1:31 PM

Andra Pradesh: కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అమిత్‌ షా, బాద్‌షా భేటీపై ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగానే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ని అమిత్‌ షా కలిసి ఉంటారని చెప్పుకొచ్చారు.. రాజకీయంగా బీజేపీకి లబ్ధిలేనిదే… ఏ ఒక్కరినీ అమిత్‌షా, మోడీ ద్వయం కలవరని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హీరోగా పాన్‌ ఇండియా లెవెల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థాయి పెరిగింది కాబట్టే.. ఆయనను అమిత్‌ షా కలిసి ఉండవచ్చునని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లి ఎంత ప్రయత్నించినా ఎవరూ కలవడం లేదని ఎద్దేవా చేశారు కొడాలి నాని. తాజాగా నాని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి