Andhra Pradesh: ఏపీ పేరును ‘వైఎస్ఆర్ ల్యాండ్’ అని మార్చండి.. సీఎం కు సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ప్రాంతాల పేర్లు మార్పుపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతం పేరు మార్చవద్దంటూ కోనసీమ వాసులు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రంలో కాక పుట్టించాయి. కోనసీమ జిల్లా పేరును...

Andhra Pradesh: ఏపీ పేరును వైఎస్ఆర్ ల్యాండ్ అని మార్చండి.. సీఎం కు సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్
Nageshwararao

Updated on: May 27, 2022 | 2:46 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ప్రాంతాల పేర్లు మార్పుపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతం పేరు మార్చవద్దంటూ కోనసీమ వాసులు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రంలో కాక పుట్టించాయి. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చవద్దంటూ చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్(Twitter) చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును ‘వైఎస్సార్‌ ప్రదేశ్‌’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు నా విన్నపమంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలుగు(Telugu) ను ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి వైఎస్‌ఆర్‌ ల్యాండ్‌ అని ఇంగ్లీష్ పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది…’ అని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

మరోవైపు.. అమలాపురంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మంగళవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఘటనకు కారకులెవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు పరారీలో ఉండడంతో అందుబాటులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో అలజడికి ఆస్కారం లేదన్న అంచనాకు వచ్చే వరకు నిఘా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రావులపాలెంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. వ్యాపారసంస్థలు తెరచుకున్నాయి. ప్రధాన కూడళ్లలో బందోబస్తు కొనసాగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి