Andhra Pradesh: తప్పిపోయిన పులి కూనలు.. అడవిలోకి వదిలేందుకు అధికారుల ఏర్పాట్లు

|

May 14, 2023 | 9:47 AM

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరై దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక చేసింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. అయితే నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందిస్తూ శిక్షణ ఇస్తున్నారు.

Andhra Pradesh: తప్పిపోయిన పులి కూనలు.. అడవిలోకి వదిలేందుకు అధికారుల ఏర్పాట్లు
Tiger Cubs
Follow us on

కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరై దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక చేసింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. అయితే నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందిస్తూ శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో మధ్యప్రదేశ్‌లోని కన్హా, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు అధికారుల బృందం శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి తరహాలోనే ఆత్మకూరులోని నల్లమల అడవిలో కూడా ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్‌ ఎలా వేశారు, ఎంత ఖర్చయింది, ఎన్‌క్లోజర్‌ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేయనున్నారు.

నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్‌ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. మొదటగా నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్‌క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక రూపొందించారు.అయితే ఈ పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్‌క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి పంపిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో కూడా ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లు తయారుచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..