Viral Video: బాబోయ్.! ఎగిరే పామును చూశారా.? ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి

| Edited By: Ravi Kiran

Oct 09, 2024 | 5:12 PM

ఎగిరే పామును ఎక్కడైనా చూసారా..? చూసి ఉండొచ్చు కానీ టీవీలలోనో.. సోషల్ మీడియాలోనో..! మీరు చూసిన పాముల్లో అందమైన ఎగిరే పాము ఉందా..? అదేనండి శరీరమంతా ఎరుపు నలుపు బంగారు వర్ణ చారాలతో నిగనిగలాడుతూ కదిలే

Viral Video: బాబోయ్.! ఎగిరే పామును చూశారా.? ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి
Flying Snake
Follow us on

ఎగిరే పామును ఎక్కడైనా చూసారా..? చూసి ఉండొచ్చు కానీ టీవీలలోనో.. సోషల్ మీడియాలోనో..! మీరు చూసిన పాముల్లో అందమైన ఎగిరే పాము ఉందా..? అదేనండి శరీరమంతా ఎరుపు నలుపు బంగారు వర్ణ చారాలతో నిగనిగలాడుతూ కదిలే ఆ పామును చూస్తే ముచ్చటగా అనిపిస్తోంది. కానీ ఎంతైనా పాము కదా భయమే.. అరుదైన ఆ పాము పాడేరులో కనిపించింది.

అల్లూరి ఏజెన్సీలో ప్రజలు మున్నెన్నడూ చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. చాకలిపేటలో ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తుపై వింతగా కనిపించింది ఈ పాము. శరీరంపై నలుపు, ఎరుపు, గోల్డ్ రంగుల రింగులుగా చారలు ఉన్నాయి. భయపడిన ఆ కుటుంబం.. స్థానికులకు చెప్పడంతో విషయం ఆ నోట ఈ నోట పాకింది. దీంతో రెండు అంతస్తు మేడ పై ఉన్న ఈ పామును చూసేందుకు జనం తరలివచ్చారు. గతంలో ఎన్నడూ ఎటువంటి పామును వాళ్ళు చూడకపోవడంతో ఆసక్తిగా తిలకించారు. అది కదిలేసరికి అంత పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ వాసుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వాసు.. చాకచక్యంగా పామును పట్టుకున్నారు. సమీప అడవుల్లో విడిచిపెట్టారు. రాత్రిపూట సంచరించడం ఈ పాము సహజ లక్షణం. తన శరీరాకృతిని ఒక చోట నుంచి మరో ప్రాంతానికి దూకేలా.. ఎగిరేందుకు మలుచుకుంటూ వెళుతుంది. ఒక్కో సమయంలో చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంది. చెట్టు పైకి పాకుతూ ఎత్తైన ప్రాంతం నుంచి మరోచోటకి దూకే ప్రయత్నం చేస్తుంది.

ఇది ఎగిరే పాము..

సరీసృపాలలో చాలా జీవులు పాకుతూ ఉంటాయి. ముఖ్యంగా దాదాపు పాముల జాతులన్నీ పాకుతూ కదలికలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ పాము మాత్రం.. ఎత్తైన భవనం గాని చెట్టు గాని ఎక్కి.. అక్కడ నుంచి మరో చోటకి ఎగురుతుంది. ఈ పాము శాస్త్రీయ నామం క్రిసోపెలియా ఆర్నాటా. దక్షిణ, ఆగ్నేయాసియా కనిపించే తేలికపాటి విషపూరితమైన పాము. దీనిని బంగారు చెట్టు పాము, అలంకరించబడిన ఎగిరే పాము, బంగారు ఎగిరే పాము అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ రకమైన పాముల్లో ఐదు జాతులు ఉన్నాయి. వీటిని పశ్చిమ భారతదేశం నుండి ఇండోనేషియా ద్వీపసమూహం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. ఎగరడానికి ప్రత్యేక అవయవాలు లేకపోయినా.. దాని శరీరాకృతిని అనుగుణంగా మలుచుకొని ఒకసారి దాదాపుగా 100 మీటర్ల వరకు ఎగర గలదు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం పైకి గెంతే స్వభావం కలది. ఈ తేలికపాటి విషపూరిత సరీసృపాలు చిన్న ఎలుకలు, బల్లులు, కప్పలు, పక్షులు మరియు గబ్బిలాలను ఆహారంగా తీసుకుంటాయి. స్వల్పంగా విషపూరితమైనవీ ఈ పాములు అయినప్పటికీ.. వాటి విషం మనిషి ప్రాణాలకు కోల్పోయేంత ప్రమాదకరం కాదు.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..