Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను కమ్మేసిన పొగమంచు విమాల రాకపోకలకు మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో ఉదయం నుంచి మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు బ్రేక్ పడింది. మంచు దెబ్బకు విమానాల ల్యాండింగ్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.
ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఫైట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానాన్ని దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంచు ప్రభావం తగ్గిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు అనుమతించనున్నారు.
జనవరి నుంచి పొగమంచు ప్రభావం ఎయిర్‌పోర్ట్‌పై పడింది. విమానాశ్రయంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాన్ని మంచు కమ్మేసింది. మార్చి నెలాఖరు అయిన మంచు ప్రభావం మాత్రం తగ్గడం లేదు. కొద్దిరోజులుగా మంచు దెబ్బకు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టుకు రావాల్సిన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి.
కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నారు. కొన్ని విమానాలు బెంగళూరు, హైదరాబాద్‌కు పంపించారు. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మాత్రమే విమానాలను ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేస్తున్నారు.