వేడివేడిగా చేపల పులుసు తినాలనుకున్నారు.. కట్ చేస్తే.. ఊహించని సీన్‌తో అంతా షాక్.!

| Edited By: Ravi Kiran

Jan 26, 2024 | 10:36 AM

మరికాసేపట్లో వేడివేడిగా చేపల పులుసు రెడీ అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూర్చుని తిందామనుకున్నారు. కానీ చేపల పులుసు రెడీ అవ్వక ముందే జరగాల్సింది జరిగిపోయింది.

వేడివేడిగా చేపల పులుసు తినాలనుకున్నారు.. కట్ చేస్తే.. ఊహించని సీన్‌తో అంతా షాక్.!
Fish Curry
Follow us on

సత్యసాయి జిల్లా, జనవరి 26: మరికాసేపట్లో వేడివేడిగా చేపల పులుసు రెడీ అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూర్చుని తిందామనుకున్నారు. కానీ చేపల పులుసు రెడీ అవ్వక ముందే తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురయ్యాడు.. కట్ చేస్తే.. తమ్ముడు జైలు పాలయ్యాడు. చివరికి చేపల పులుసు కాస్తా అన్న ప్రాణం పోయేలా చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నడిమికుంటపల్లి గ్రామానికి చెందిన సంజీవ్, వెంకటేశ్‌లు ఇద్దరు అన్నదమ్ములు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు భార్య పుట్టింటికి వెళ్లడంతో మార్కెట్‌కు వెళ్లి చేపలు తీసుకొచ్చాడు అన్న సంజీవ్.. తన తమ్ముడు వెంకటేష్ భార్యను చేపల పులుసు వండమని చెప్పాడు. చేపల పులుసు వండేందుకు తమ్ముడు వెంకటేష్ భార్య మసాలాలు సిద్ధం చేస్తుంటే.. అన్నదమ్ములు ఇద్దరు ఫుల్లుగా మందు కొట్టారు. ఫుల్లుగా మందు కొట్టిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరి మధ్య చేపల పులుసు వండే విషయంలో గొడవ జరిగింది.

చేపల పులుసు త్వరగా వండాలంటే.. మసాలాలు రెడీ చేసేందుకు సాయం చేయాలని మిద్దెపై నిద్రిస్తున్న తమ్ముడు వెంకటేష్‌ను అన్న సంజీవ్ పదేపదే విసిగించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతుండగానే తమ్ముడి వెంకటేష్ భార్య చేపల పులుసు వండేందుకు అన్నీ రెడీ చేసి పొయ్యి కూడా వెలిగించింది. కానీ అంతలోనే తమ్ముడు వెంకటేష్ మద్యం మత్తులో ఒక కర్ర తీసుకుని వచ్చి అన్న సంజీవ్‌పై దాడి చేశాడు. దీంతో అన్న సంజీవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చేపల పులుసు వండే విషయంలో తలెత్తిన వివాదం ఆఖరికి అన్న ప్రాణాలు తీసే అంతవరకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.