
యాగంటి క్షేత్రంలో భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. పార్కింగ్ చేసిన కారు నుండి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కారుకు దూరంగా జరిగారు. వివరాల్లోకెళితే.. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ వాహనాలను పార్కింగ్ ప్లేస్‌లో పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులు తమ కారును కూడా పార్కింగ్ ప్లేస్‌లో పెట్టి దైవ దర్శనం కోసం వెళ్లారు. అలా వారు వెళ్లిన కాసేపటికే కారులు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌తో పాటు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Also read:
బీజేపీలోకి మరో మాజీ మంత్రి.. ఫలించిన అరుణ మంత్రాంగం.. చేరికకు ముందు మహాయాగం