గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ. తన పాపులారిటీ తగ్గిందని అందరికీ తెలిసిపోతుందనే ఒక్క భయంతోనే ..చిన్న గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా తాయిలాలు విసిరారని విమర్శించారు. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తికి.. ఇలా జరుగుతుందని తెలియదా అని ప్రశ్నించారు. మీ పర్సనల్ ఇగో, ఫొటోల కోసం జనం ప్రాణాలు తీశారని.. మీ పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమన్నారు.
40ఏళ్ల అనుభవమున్న మీకు అలా జరుగుతుందని తెలియదని చెప్పడం ఎవరూ నమ్మరన్నారు ఆర్జీవీ. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని ఆరోపించారు. రాజకీయ నాయకుడికి ప్రజల వెల్‌ఫేర్ ముఖ్యమవ్వాలని.. కానీ వారిని చంపి.. శవాలపై నిల్చుని.. పాపులారిటీ పెంచుకోవడం దారుణమన్నారు. హిట్లర్, ముస్సోలిని తర్వాత ఆ తరహా వ్యక్తిని చంద్రబాబులో చూస్తున్నానంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్జీవీ.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం