AP News: గోదారి తల్లి.! నీకు ఇది తగునా.. నమ్ముకున్న ప్రజలను ఒడ్డుకు చేర్చవమ్మా..

గోదావరి వెంబడి ఉన్న లంక గ్రామాలు ఇక కనిపించవా.. సారవంతమైన భూములను తనలో కలిపేసుకుంటోంది గోదావరి తల్లి. దీంతో సన్నకారు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

AP News: గోదారి తల్లి.! నీకు ఇది తగునా.. నమ్ముకున్న ప్రజలను ఒడ్డుకు చేర్చవమ్మా..
Coconut Trees

Edited By:

Updated on: Feb 11, 2025 | 8:54 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలోని పాశర్లపూడి, పాశర్లపూడి లంక, అప్పనపల్లి, పెదపట్నం లంక, బి.దొడ్డవరం, సఖినేటిపల్లిలంక, అప్పన్న రామునిలంక, రామరాజులంక లాంటి పలు లంక గ్రామాలు నదీ తీరం వెంబడి ఉన్న సారవంతమైన భూములు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కొబ్బరి తోటలు, లక్షలాది కొబ్బరి చెట్లు గోదావరిలో కలిసిపోతున్నా.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక కొబ్బరి చెట్టు నాటిన దగ్గర నుంచి కాపు కాయడానికి ఐదు ఏళ్లు సమయం పడుతుందని.. ఇలా కాపు కాసే సమయానికి కొబ్బరి చెట్లు కళ్ళఎదుటే నదీ గర్భంలో కలిసిపోవడం రైతుకు కంటనీరు తెప్పిస్తున్నాయి. తక్షణం ప్రభుత్వాలు స్పందించి గోదావరి నది తీరం వెంబడి గ్రొవెన్స్ నిర్మాణం చేపట్టాలని సారవంతమైన కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు బాధిత రైతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి