అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహం కుడి చేయి రెండు పాదాలు కాలిపోయినట్టుగా ఉన్నాయి. శరీరంపై కొన్ని గుర్తులను నోట్ చేసుకున్నారు. అదే రైల్వే ట్రాక్ ప్రాంతానికి సమీపం కావడంతో.. అక్కడికి వాహనాలు వెళ్ళవు. కానీ ఆ మృతదేహాన్ని తరలించాలి. దీంతో ఆ మహిళ ఎస్సై స్వయంగా రంగంలోకి దిగింది.
శుక్రవారం(డిసెంబర్ 27) ఉదయం పన్నేండు గంటల ప్రాంతంలో.. పోలీసులకు ఫోన్ కాల్.. జగ్గయ్యపేట రైల్వే క్యాబిన్ సమీపంలో ఓ మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉందని. పోలీసులు రష్ అయ్యారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాల కోల్పోయాడు. పోలీసులు ఐడెంటిఫికేషన్ మార్క్స్‌ను గుర్తించారు. స్కై బ్లూ రంగులో షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు.. ధరించి మెడలో ఎరుపు రంగు తాడు. కుడి చేతికి కి ఎరుపు తాడు.. అదే చేతికి నల్లని రిస్ట్ బ్యాండ్… చేతికి కే అక్షరంతో టాటు.. ఆ తర్వాతి అక్షరాలు చేయి కాలిపోవడంతో కనిపించలేదు. జేబులో 21వ తేదీన కైకలూరు నుంచి దువ్వాడ వరకు సెకండ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ఉంది. మరిన్ని ఆధారాలు గుర్తించారు పోలీసులు..
ఆ తర్వాత బాడీని భద్రపరచాలి..! మార్చురీకి తరలించాలి.. మృతదేహం రైల్వే ట్రాక్ ప్రాంతం కావడంతో.. అక్కడకు వాహనాలు వెళ్లే పరిస్థితి కనిపించలేదు.. దీంతో పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న గాజువాక మహిళా ఎస్సై సూర్యకళ ముందుకు వచ్చారు. పురుషులతో సమానంగా.. మృతదేహాన్ని భుజాలపైకి ఎత్తుకుని మోశారు. అక్కడ మరింత మంది పురుషులు ఉన్నప్పటికీ మానవత్వంతో ఆ మృతదేహాన్ని స్వయంగా మోసి వాహనం వరకు తీసుకెళ్లారు.
వీడియో చూడండి..
అక్కడ నుంచి స్వచ్ఛంద సేవా సంస్థ వాహనంలో మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మోసిన దూరం కొంతే కావచ్చు.. కానీ ఎస్సై విధుల్లో ఉన్న ఓ మహిళ ఇలా తన విధి నిర్వహణ కాకుండా మానవత్వాన్ని చాటుకోవటం అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. మృతదేహం గుర్తుల ఆధారంగా ప్రకటన చేసిన పోలీసులు.. ఆచూకీ తెలిస్తే 9440796014, 9440904325 ఈ నెంబర్లకు తెలపాలని సూచించారు పోలీసులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..