Andhra Pradesh: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. లవ్ మ్యారెజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరి..

కన్న తండ్రే కాలయముడయ్యాడు. ప్రేమించిన నేరానికి కడుపున పుట్టిన దాని ఉసురు తీశాడు.. గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతునులిపి చంపేశాడు.. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్య అంటూ చిత్రీకరించాడు. సాంకేతిక ఆధారాలతో హత్య అని రూడీ చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Andhra Pradesh: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. లవ్ మ్యారెజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరి..
Father Kills Daughter Over Love Marriage

Edited By:

Updated on: Apr 02, 2026 | 12:42 PM

కన్న తండ్రే కాలయముడయ్యాడు. ప్రేమించిన నేరానికి కడుపున పుట్టిన దాని ఉసురు తీశాడు.. గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతునులిపి చంపేశాడు.. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్య అంటూ చిత్రీకరించాడు. సాంకేతిక ఆధారాలతో హత్య అని రూడీ చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్ కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకూ చదివి ఇంటిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తమ ఇంటికి సమీపంలో ఉండే జమ్మలమడకకు చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇద్దరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే.. అయితే, ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భావించిన జంట ఇంటిలో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్దీ రోజుల పాటు చెన్నై వెళ్లి అక్కడ నుండి నర్సరావుపేట వచ్చి స్నేహితుడి ఇంటిలో ఉన్నారు. అయితే కూతురు ఇంటిలో నుండి వెళ్లిపోవడంతో చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులైన కూతురు ఆచూకీ తెలియకపోవడంతో మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో గురజాల డిఎస్పీ రంగంలోకి దిగి చౌడేశ్వరి ఆచూకీ కనుగొంటామని చెప్పడంతో ఆ రోజ పిఎస్ వద్ద నుండి చంద్ర శ్రీను తమ బంధువులతో పాటు వెళ్లిపోయాడు.

ఈ ఘటన జరిగిన మూడు రోజులకే చౌడేశ్వరి నాగరాజు ఆచూకీ తెలుసుకున్న పోలీసులు మాచర్ల పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు. ఇరు వర్గాల పెద్ద మనుషులతో మాట్లాడించారు. ఇరువురు మేజర్లు కావడంతో తాము ఏమీ చేయలేమంటూ పోలీసులు చెప్పేశారు. అయితే ఇద్దరిని ఇరువురు తల్లిదండ్రులకు అప్పగించగా పెద్ద మనుషుల పంచాయితీ జరిగింది. పంచాయితీలో చౌడేశ్వరి నాగరాజు వద్దే ఉంటానని తెగేసి చెప్పింది. అయినప్పటికీ, ఐదు రోజుల పాటు ఎవరింటికి వాళ్లు వెళ్లాలని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పెద్దమనుషులు చెప్పారు.

చౌడేశ్వరిని తనతో పాటు తీసుకొచ్చిన శ్రీను తన ఇంటిలోనే ఉంచాడు. తర్వాత రోజు చౌడేశ్వరి ఉరివేసుకుని చనిపోయిందంటూ అందరికి చెప్పాడు. దీంతో మనస్థాపంతోనే చనిపోయిందని అందరూ భావించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

చౌడేశ్వరి తండ్రే ఆమెను చంపి కొన ఊపిరితో ఉండగా ఉరి వేసినట్లు నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చంద్ర శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కూతురినే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రిని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు.

Follow Us