కర్నూల్ జిల్లాలో బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దద్దనాల ప్రాజెక్టు మలుపు వద్ద డీజిల్ ట్యాంకర్ లారీని సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. డీజిల్ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న డీజిల్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి