Road Accident: నెత్తురోడిన రహదారి.. తుఫాన్‌ను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం

గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

Road Accident: నెత్తురోడిన రహదారి.. తుఫాన్‌ను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
Accident

Updated on: May 15, 2023 | 8:39 AM

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

మార్గ మధ్యలో కడప -తాడిపత్రి ప్రధాన రహదారిలో వైఎస్సార్‌ జిల్లా కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో వీరందరూ ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్నలారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Follow Us