Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..

|

Aug 15, 2021 | 6:25 AM

Andhra Pradesh: ఆరుగాలం కష్టపడి పని చేసి పండించిన పంటకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు వ్యాపారులు. దాంతో దిక్కుతోచని స్థితిలో..

Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..
Farmers
Follow us on

Andhra Pradesh: ఆరుగాలం కష్టపడి పని చేసి పండించిన పంటకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు వ్యాపారులు. దాంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు. వివరాల్లోకెళితే.. విశాఖపట్నం జిల్లాలో రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో మద్దతు ధర లేకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వ్యాపారుల చర్యలకు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దేవరాపల్లి, హోల్ సేల్ కూరగాయల మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక కూరగాయలను రైవాడ కాలువలో పారబోసారు రైతులు. దళారీల బారి నుంచి తమను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డుకుని స్థానిక వ్యపారులు సిండికేట్ అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా సిండికేట్ అయిన వ్యాపారులు.. తాము కష్టపడి పండించిన పంటకు మద్ధతు ధర లభించకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఆరవై సంవత్సరాల నుండి కోనసాగుతున్న దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌కు.. వేపాడ, ఆనంతగిరి, దేవరాపల్లి, చీడికాడ మండలాలుకు చేందిన రైతులు కూరగాయలను పండించి తీసుకువస్తున్నారు. యగురాలు పండించి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తాజాగా మార్కెట్‌కు కూరగాయలు తీసుకువచ్చారు. అయితే, ఈ కూరగాయలను కొనేవారే లేకపోవడంతో.. ఆందోళనకు గురయ్యారు. మద్దతు ధర లేక, కూరగాయలను కొనేవారు లేకఈరోజు కోనేవాడె రాకపోవడంతో రైతులకు మద్దతు ధర లేకపోవడంతో సంతో శిస్తు కట్టలేక.. ఆ కూరగాయలన్నింటినీ రైవాడ కాలువలో పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కోల్డ్ స్టోరిజి నిర్మించి మార్కెట్ సౌకర్యం కల్పించాలని, పంటలకు మధ్ధతు ధర ఇచ్చి రైతులును ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Also read:

Independence Day 2021 Live: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా స్పెషల్.. ఎర్రకోటపై రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం.. షెడ్యూల్ వివరాలు..

Andhra Pradesh: ఏం కాదులే అని ముందుకు వెళ్లాడు.. అందరి ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు.. అదృష్టం బాగుండి బయటపడ్డారు..

YS Viveka Murder Case: ‘‘పెద్దలతో పెట్టుకునే శక్తి లేదు.. నాకు ప్రాణ హానీ ఉంది’’: మణికంఠ రెడ్డి