AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Floods: వరద బాధితులకు రూ.600 విరాళం.. స్పందించిన పవన్ కల్యాణ్..

వీఐపీల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ తమకు తగ్గ స్థాయిలో వరద బాధితుల కోసం విరాళాలు ఇస్తున్నారు. పనికి వెళ్తే కానీ కుటుంబం గడవని ఓ వ్యక్తి సైతం వరద బాధితులకు విరాళం ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అయింది.

AP Floods: వరద బాధితులకు రూ.600 విరాళం.. స్పందించిన పవన్ కల్యాణ్..
Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2024 | 1:17 PM

Share

ఏపీలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినిమావాళ్లు, వ్యాపారవేత్తలే కాకుండా.. సామాన్యులు సైతం తమకు కుదిరినంత స్థాయిలో డొనేషన్స్ ఇస్తున్నారు. విరాళాలు ఇచ్చేవారి కోసం బ్యాంకు అకౌంట్ డీటేల్స్‌తో పాటు యూపీఐ కోడ్ సైతం విడుదల చేసింది ఏపీ సర్కార్. అయితే వరద బాధితుల కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఒకరు.. రూ 600 సాయంగా అందజేశారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.

“ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది” అంటూ గుడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో రిప్లై ఇచ్చింది.

” రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” పవన్ కల్యాణ్ తరుఫున డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది.   పనిచేస్తే కానీ పూట గడవని స్థితిలో.. వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆ వ్యక్తి చేసిన సాయంపై నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సైతం వరదలో తల్లిడిల్లిన తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున విరాళం ప్రకటించారు. అంతేకాదు ఏపీలో వరదలతో దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు సైతం లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us