
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఊరిలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలం అల్లినగరంకు చెందిన జక్క రాఘవేంద్ర శుక్రవారం రాత్రి తన భార్య ఈశ్వరమ్మ.. కూతుళ్లు వైష్ణవి, వరలక్ష్మిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం రాఘవేంద్ర ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రాఘవేంద్ర, భార్య, కూతురు ఈశ్వరిలు ప్రాణాలు కోల్పోగా మరో కూతురు వరలక్ష్మి కొన ఊపిరితో ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వరలక్ష్మి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. ఆర్థిక ఇబ్బందులు వల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నారు.