Andhra Pradesh: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..! రెండు ముక్కలుగా విడిపోయిన భోగీలు..

సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు.

Andhra Pradesh: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..! రెండు ముక్కలుగా విడిపోయిన భోగీలు..
Falaknuma Express

Updated on: Apr 08, 2025 | 10:46 AM

శ్రీకాకుళం జిల్లా పలాసలో రైలు ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది విడిపోయిన బోగీలను రైలుకు అమర్చారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే, రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు విడిపోవటం పట్ల అధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందనే దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us