Andhra Pradesh: పుణ్యం కోసం గుడికి పోతే.. పోలీసోడని చెప్పి కారును ఎత్తుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..

|

Jul 26, 2021 | 10:13 PM

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక దొంగలు హల్ చల్ చేస్తున్నారు.

Andhra Pradesh: పుణ్యం కోసం గుడికి పోతే.. పోలీసోడని చెప్పి కారును ఎత్తుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..
Car Chori
Follow us on

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పోలీసులమంటూ వాహనాలను ఆపి తనిఖీల పేరిట కాస్సేపు హంగామా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు ఈ నకిలీ పోలీసులు. సరిహద్దుల్లో కాపుకాసి ఇతర రాష్ట్రాలకు చెందిన వారిన బెదిరించి పెద్ద వాహనాలతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ ఇన్నోవా కారును దొంగిలించే ప్రయత్నంలో ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.

తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇన్నోవా వాహనంలో చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమాంబ దర్శనానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన వీరిని కుప్పం మండలం బంగారునత్తం గ్రామ సమీపంలో పోలీసులమంటూ ఓ ఐదుగురు ఆపారు. తనిఖీ చేస్తామంటూ ఇన్నోవా లోంచి భక్తులను కిందకు దించి వారు కారెక్కారు. ఇలా ముగ్గురు కారుతో ఉడాయించగా మరో ఇద్దరు అక్కడినుండి పారిపోయే ప్రయత్నం చేశారు.. అయితే బాధితులు ఆ ఇద్దరిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన స్టైల్లో వారిని విచారించగా తమ వివరాలను బయటపెట్టారు. కర్ణాటకలోని కేజిఎఫ్ ప్రాంతానికి చెందినవారమని తెలిపారు. ఓ ముఠాగా ఏర్పడి పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతూ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇన్నోవాతో పరారయిన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Also read:

Vijayawada News: పై నుంచి దిగొచ్చిన దొంగలు.. చూస్తుండనే నాలుగు షాపుల్లో భారీ చోరీకి పాల్పడ్డారు..

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

Andhra Pradesh: విజయవాడ – బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..