Kadapa District: తెల్లనివన్నీ పాలు కాదు..! అంతా కల్తీ రాజ్యం.. తస్మాత్ జాగ్రత్త..!

|

Mar 25, 2021 | 8:07 PM

కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీపాల తయారీ విచ్చలవిడిగా చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించాలన్న ఆశతో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Kadapa District: తెల్లనివన్నీ పాలు కాదు..! అంతా కల్తీ రాజ్యం.. తస్మాత్ జాగ్రత్త..!
Fake Milk
Follow us on

కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీపాల తయారీ విచ్చలవిడిగా చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించాలన్న ఆశతో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను కలిపి పాలను తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలతో కలిపి విక్రయించి అధిక మొత్తం పొందుతున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో జోరుగా కల్తీపాల వ్యాపారం సాగుతోంది. గ్రామాల్లోని కొన్ని పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఫిర్యాదులు రావడంతో ఇటీవల రెండుసార్లు పోలీసు, జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేసినా మార్పు లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు, ఎస్బీఐ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో గుట్టుగా కల్తీపాలు తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. సుధాకర్‌ అనే వ్యక్తి ప్రొద్దుతిరుగుడు పువ్వుల నూనెతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో క్యాన్‌కు రెండు లీటర్ల ఆయిల్‌ కలుపుతూ పాలు తయారుచేస్తున్నట్లు అధికారులు తేల్చారు. కల్తీపాలను టెస్ట్‌కు పంపించారు. ల్యాబ్‌ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

కాగా ఇందుగలదు.. అందులేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా కల్కీ కనిపిస్తుంది. తినే ఆహారం దగ్గర్నుంచి.. ధరించే బట్టలు, వినియోగించే వస్తువులు.. వాట్ నాట్.. అన్నీ కల్తీ అయిపోతున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది.  పొడక్ట్స్ తయారీలో పారదర్శకత ఉండాలి. లేకపోతే మనిషి మనుగడకే ప్రమాదం.

Also Read: విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల