Fact Check: హెచ్‌ఎస్‌బీసీ (HSBC) విశాఖ శాఖ చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. ఇక్కడి సిరిపురం జంక్షన్‌లోని ఈ కంపెనీని యాజమాన్యం పూర్తిగా మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు మూసివేయడుతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అవుతున్నాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో పేరొందిన హెచ్‌ఎస్‌బీసీ.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తన బ్యాంకులకు ఇక్కడి నుంచే సేవలు అందించేది. గ్రాడ్యుయేట్లకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఉత్తరాంధ్ర యువతకు భరోసాగా నిలిచింది. ఏడాదిన్నర కింద కంపెనీలో భారీ కుంభకోణం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను కుదించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మన దేశంలో చెన్నై, కోల్‌కతాతో పాటు విశాఖ శాఖనూ మూసేయాలని నిర్ణయించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విశాఖ బ్రాంచ్ మూసివేతపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్‌ఎస్‌బీసీ ((HSBC) విశాఖ బ్రాంచ్ మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఏపీ ప్రభుత్వ స్పష్టం చేసింది. హెచ్‌ఎస్‌బీసీ నెమ్మదిగా ఏ సర్వీస్ మోడల్ బ్యాంకింగ్‌లోకి వెళ్తుందని, దీనిని మూసివేయడం లేదని ప్రభుత్వ ఫ్యాక్ చెక్ ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపింది.
అయితే భారతదేశంలోని 29 నగరాల్లో ఉన్న 50 శాఖలను 14 నగరాల్లో 26 శాఖలకు కుదించేందుకు ఇప్పటికే ప్రణాళిక రెడీ అయ్యాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో విశాఖ హెచ్‌ఎస్‌బీ బ్రాంచ్ లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విశాఖలో ఉన్న హెచ్‌ఎస్‌బీఎస్‌ను మూసివేస్తారనడం అబద్దమని ప్రభుత్వం తెలిపింది.
కాగా, హెచ్‌ఎస్‌బీసీ ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ మొదటి వారానికల్లా ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఇక్కడ పని లేదని, భవనం కూడా ఖాళీ చేస్తున్నామని అద్దెకు ఇచ్చిన యాజమాన్యానికి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల ముగిసే వారకు విశాఖ హెచ్‌ఎస్‌బీసీ మూసివేయబడుతోందని వస్తున్నవార్తలను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
MISLEADING!
HSBC Visakhapatnam Branch is not closing because of AP Govt. HSBC is moving to the Banking as A Service (BaaS) model slowly and closing most of its retail outlets worldwide.Read More: https://t.co/xDhg8QLS4s
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) December 16, 2021