దేశంలో ఫస్ట్‌ టైం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్

| Edited By:

Jan 22, 2020 | 7:03 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా.. ‘ఫేస్ రికగ్నిషన్ యాప్‌’ని ప్రవేశ పెట్టింది ఎన్నికల సంఘం. దొంగ ఓట్లు పడకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ వినూత్నంగా ఈ ప్రయోగానికి తెరలేపింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే 10 ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. భారత దేశంలోనే ఏ ఎన్నికల్లోనూ ప్రయోగించని.. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను మొట్టమొదటి సారిగా తెలంగాణలో ప్రయోగించబోతున్నారు. ఈ యాప్‌ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మున్సిపలిటీలో పైలెట్ […]

దేశంలో ఫస్ట్‌ టైం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
Follow us on

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా.. ‘ఫేస్ రికగ్నిషన్ యాప్‌’ని ప్రవేశ పెట్టింది ఎన్నికల సంఘం. దొంగ ఓట్లు పడకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ వినూత్నంగా ఈ ప్రయోగానికి తెరలేపింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే 10 ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. భారత దేశంలోనే ఏ ఎన్నికల్లోనూ ప్రయోగించని.. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను మొట్టమొదటి సారిగా తెలంగాణలో ప్రయోగించబోతున్నారు. ఈ యాప్‌ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మున్సిపలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా ఉపయోగిస్తారు.

కృతిమ మేథ, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్‌ల మేళవింపుగా ఈ సాంకేతికత పనిచేస్తుందని వెల్లడించారు అధికారులు. ఓటు వేసిన వ్యక్తుల ఫొటోలు అందులో భద్రపరుస్తారు. అయితే ఇది పైలెట్ ప్రాజెక్టు కాబట్టి.. పూర్తిగా ఓటింగ్ ముగిసిన తర్వాత ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తామని, ఏ ఇతర వాటికి వాటిని అనుసంధానించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఈ యాప్‌ని ఎలా ఉపయోగిస్తారంటే.. ఓటు వేసే వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌తో ఫొటో తీస్తారు. అప్పటికే మొబైల్ ఫోన్‌కి లింక్ ఉన్న ఎలక్షన్ కమిషన్ డేటాలో ఓటర్ మొఖాన్ని చెక్ చేస్తారు. ఆ రెండు మొఖాలు సేమ్ అయితేనే ఓటు వేయడానికి అర్హులవుతారు. ఈ మధ్య దొంగ ఓట్లు ఎక్కువ అవడంతో.. వాటికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఈ విధమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.