
రాయవరం, అక్టోబర్ 8: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం మండలం రాయవరం లక్ష్మి గణపతి బాణా సంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మందుగుండు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పైర్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పైర్ సిబ్బంది అక్కడ మంటలను అదుపు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అందరూ అక్కడ పనిచేస్తున్న కార్మికులుగా గుర్తింపు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదంపై స్పందించిన హోం మంత్రి అనిత. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపిన మంత్రి అనిత. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన హోం మంత్రి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.