Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..

|

Oct 08, 2021 | 12:57 PM

అనంతపురం జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో బీర్లు రోడ్డుపై పారపోశారు. అయ్యో ఇదేం పని..

Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..
Budweiser Beer
Follow us on

ఎక్కడైనా మద్యం ఏరులై పారుతుందని మాట తరచూ మనం వింటుంటాము.. కానీ ఇంతవరకు ఎవరూ చూసిఉండరు కదా అయితే ఈ సంఘటన చూస్తే మీరు కూడా అదే నిజం అంటారు. అనంతపురం జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో బీర్లు రోడ్డుపై పారపోశారు. అయ్యో అక్కడ మద్యం నిశేదం ఉందా ఏంటి అని అశ్చర్యపోకండి. పారపోసింది కూడా ప్రభుత్వ అధికారులే.. అలా అని అది అక్రమ మద్యం అసలే కాదు.. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న ఐఎంఎల్ మద్యం డిపోలో కాలం చెల్లిన బీర్లు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బడ్ వైజర్ అనే బ్రాండ్ బాటిల్స్ ఎక్కువ మొత్తంలో కాలం చెల్లినవి ఉన్నట్లుగా తెలుసుకొని వాటిని ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.2272 కేసుల బీర్ బాక్సుల్లో ఉన్న 27,264 బాటిల్స్ కాలం చెల్లినవ గా గుర్తించారు. దీంతో వాటన్నింటినీ మొత్తం రోడ్డుపై పారబోసి ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో బీరు కాస్త ఏరులై పొంగింది.

సాధారణంగా బీర్ బాటిల్స్ కు ఆరు నెలల కాల వ్యవధి మాత్రమే ఉంటుందన్నారు. ఆరు నెలల తర్వాత కెమికల్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాలం చెల్లిన మద్యాన్ని నిల్వ ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.