Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‍రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి తదితరులు చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు జమ్మలమడుగు టిడిపి కి కంచుకోటని భూపేష్ రెడ్డి యువకుడు.. రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పారు. అంతేకాదు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వీడిన వారి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. కొందరు పార్టీని వీడారు.. అయితే పార్టీని నమ్ముకున్నవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అంబెడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.
పార్టీ లో చేరికల సందర్భం గా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పై వలస పక్షులకు టీడీపీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నికల ముందు వాసన పసిగట్టి పార్టీ లో చేరేవారికి అవకాశం ఇవ్వనని చెప్పారు. కష్టకాలంలో పార్టీకోసం పని చేసిన వారికే ఎన్నికల్లో ఇకపై గుర్తింపు ఉంటుందన్న బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను గతం లో ఈ సిద్ధాంతంలో కఠినం గా ఉండలేక పోయానని చెప్పిన టీడీపీ అధినేత .. పార్టీలో ఎవరేంటో అన్ని రికార్డ్స్ లో రాసిపెడుతున్నామని చెప్పారు.
Also Read: టమాటా లేకుండా దక్షిణాది ఫేమస్ వంటకం.. రుచికరమైన సాంబారు తయారీ విధానం