దేశం దాటి వెళ్తే జగన్ అరెస్ట్ అవుతారు: బోండా ఉమ

భారత దేశం దాటి వెళ్తే జగన్ అరెస్ట్ అవుతారని అని వ్యాఖ్యానించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఆ భయంతోనే జగన్ దేశాన్ని విడిచి..

దేశం దాటి వెళ్తే జగన్ అరెస్ట్ అవుతారు: బోండా ఉమ

Edited By:

Updated on: Feb 19, 2020 | 5:48 PM

భారత దేశం దాటి వెళ్తే జగన్ అరెస్ట్ అవుతారని అని ఘాటుగా వ్యాఖ్యానించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఆ భయంతోనే జగన్ దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లడం లేదన్నారు. దుబాయ్‌లో పెట్టుబడుల సదస్సు జరిగినా జగన్.. అక్కడికి వెళ్లకపోవడానికి కారణం ఇదేనని ఆరోపణలు చేశారు. అన్ని దేశాల్లోకెల్లా.. సౌదీ చట్టాలు కఠినంగా ఉంటాయి. గతంలో వాన్ పిక్ కోసం రస్ ఆల్ ఖైమా వాళ్ళు నిమ్మగడ్డకు రూ. 845 కోట్లు ఇచ్చారు.

ఇవి తిరిగి చెల్లించకపోవడంతో రస్ ఆల్ ఖైమా సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతేకాకుండా ప్రధానిని కూడా జగన్‌ను, ఇతర ముద్దాయిలను తమకు అప్పగించాలని ఆ(RAK) దేశం కోరిందని.. కేంద్రం కూడా ఇతర దేశాల ఒత్తిడిపై ఆలోచనలో పడిందన్నారు.

కాగా.. నిమ్మగడ్డ జీవితం ఇక సెర్బియాకు అంకితమవుతుందని జోస్యం చెప్పారు ఉమ. జగన్‌తో సహా ఇతర 13 మంది నిందితులు దేశం దాటి వెళ్తే తప్పకుండా అరెస్ట్ అవుతారని.. ఆ భయంతోనే సీఎం విదేశాలకు వెళ్లడం లేదని తీవ్ర విమర్శలు చేశారు బోండా ఉమ.