Andhra Pradesh: అయ్యో.. డెలివరికి వచ్చిన బాలింత కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు.. చివరికి

ఏపీలోని ఏలురూ బోధనాసుపత్రిలో వైద్యలు చేసిన పని ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. బాలింతకు ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేయడంతో ఆమె తీవ్ర అనారోగ్యానిరి గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులు ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స తీసుకొంటోంది. ఈ ఘటనపై అక్కడి వైద్యులు స్పందించారు.

Andhra Pradesh: అయ్యో.. డెలివరికి వచ్చిన బాలింత కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు.. చివరికి
Doctors

Updated on: Aug 17, 2023 | 5:27 AM

ఏపీలోని ఏలురూ బోధనాసుపత్రిలో వైద్యలు చేసిన పని ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. బాలింతకు ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేయడంతో ఆమె తీవ్ర అనారోగ్యానిరి గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులు ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స తీసుకొంటోంది. ఈ ఘటనపై అక్కడి వైద్యులు స్పందించారు. ఆగస్టు 10వ తేదిన ఏలూరు నుంచి స్వప్న అనే మహిళను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. అయితే సర్జికల్ ఫోర్‌సెప్ (కత్తెర)ను ఆమె కడుపులోనే వదిలేశాని పేర్కొన్నారు. ఆ కత్తెర పరిమాణం రెండు ఇంచులు ఉందని చెబుతున్నారు. కడుపులో వదిలేసిన కత్తెర పేగకి అతుక్కుపోయిందని అన్నారు. అలాగే ఆ పేగు కుళ్లిపోయిందని తెలిపారు.

విజయవాడ ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిందని.. ప్రస్తుతం ఆ కుళ్లిపోయినటువంటి పేగుని తీసేసి చికిత్స చేస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అలాగే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రభాకర్‌, సర్జరీ విభాగాధిపతి అప్పారావులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి అనే గ్రామానికి చెందిన స్వప్న ప్రసవం కోసం ఏప్రిల్ 19వ తేదిన బోధనాసుపత్రిలో చేరింది.అయితే ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసిన తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిపోయిన స్వప్నకు తరచుగా కడుపు నొప్పి వచ్చేది. ఇలా నొప్పులు వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే నొప్పులు ఏమో అనుకుని మందులు వాడేది.

అయితే ఆగస్టు 8వ తేదిన స్వప్నకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికే వెళ్లింది. కానీ అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత విజయవాడలోని  ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో అక్కడ ఆమెను పరీక్షించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వప్న కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాసుపత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు.. ఆపరేషన్ కోసం వినియోగించినటువంటి కత్తెరను తెలియకుండానే కడుపులో ఉంచి కుట్లు వేసేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ అడగా అందుకు ఆయన ఇది వాస్తవమేనని పేర్కొన్నారు. సుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ కూడా స్పందించారు. దీంతో వెంటనే ఈ ఘటనపై విచారణ కమిటీ వేయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..