Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?

ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పొతే ఇబ్బందులు ఉండవని చాలామంది సర్దుకుపోతుంటారు. రోడ్ల పై ఎవరైనా గొడవ పడుతుంటే వారికి మంచి చెప్పినందుకు వెళ్లి ప్రాణాలు పోగుట్టుకున్న వ్యక్తుల స్టోరీ చదివినపుడు, విన్నపుడు ఇది నిజమేకదా అనిపిస్తుంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరి వ్యక్తులకు మంచి చెప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తిని.. ఆ వ్యక్తులే వేధించిడంతో అతను ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
Andhra Crime

Edited By:

Updated on: Jan 23, 2026 | 3:52 PM

ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులకు మంచి చెప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తికి వారి నుంచి వేధింపులు రావడంతో అతను సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసకొని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన మరణానికి కారణమైన, అతను సూసైడ్‌ నోట్‌లో రాసి ఇద్దరిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరికొందరి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాసలసిస్ వార్డులో సీనియర్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు. అయితే 2023లో డయాలిసిస్ చికిత్స కోసం వచ్చిన రోగి కుమారుడు కొమ్ము అజయ్ బాబు, అక్కడే ఆయాగా పనిచేస్తున్న కరుణకుమారిల మద్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ చర్యలను గమనించిన సుధాకర్ వాళ్ళను వరించి హెచ్చరించాడు. దీన్‌తో కక్ష పెంచుకున్న అజయ్ , కరుణలు ఉన్నతాధికారులకు సుధాకర్ పై లేనిపోనివి చెప్పి ఫిర్యాదు చేయడంతో అతడిని అవనిగడ్డకు బదిలీచేశారు అధికారులు.

అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో సుదారకర్ తిరిగి మళ్లీ జాగారెడ్డిగూడెం వచ్చాడు. ఈ సారి మరో ఇద్దరి సహాయంతో వారు సుధాకర్‌పై మళ్లీ ఫిర్యాదు చేయడం స్టార్ట్ చేశారు. ఓవైపు గతంలో చేసిన ఫిర్యాదు ఉపసంహరణ కోసం డబ్బులు డిమాండ్ చేయటం, కొత్తగా వీళ్ళు చేస్తున్న ఆరోణలతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుకు అజయ్ అతడికి సహకరిస్తున్న వీరరాఘవులు,కరుణ, ఆనంద శేఖర్ లే కారణమని సూసైడ్‌ నోట్ రాసి హాస్పిటల్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన జంగారెడ్డి గూడెం పోలీసులు అజయ్ , కరుణాలను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరికోసం గాలిస్తున్నారు. చేసే తప్పును సరిదిద్దుకోవలసిన వ్యక్తుల్లో మార్పు రాకపోగా మంచి చెప్పిన నేరానికి ఒక వ్యక్తి తన ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బందులు పడుతుంది. అయితే నేరం చేసిన వాళ్ళు చట్టానికి దొరుకుతారు కానీ భాదితులకు ఇలాంటి ఘటనల్లో జరుగుతున్న నష్టం భర్తీచేయలేనంతగా ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.