Maganti Ramji commits suicide attempt: టీడీపీ నాయకుడు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి మాగంటి బాబు కుమారుడు.. మాగంటి రాంజీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: