AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం.. 98 వార్డుల్లో ఏకంగా 43 వార్డులు..
AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. 98 వార్డుల్లో 43 వార్డులు..
AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. 98 వార్డుల్లో 43 వార్డులు వైసీపీకే ఏకగ్రీవం అయ్యాయి. వివరాల్లోకెళితే.. ఈనెల పదో తారీఖున మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుండగా ఈరోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 98 వార్డులు ఉన్నాయి. ఈ 98 వార్డులకు గాను వైసీపీ 43 వ వార్డులను ఇప్పటికే ఏకగ్రీవం అయ్యి ఆ పార్టీ సత్తా చూపింది. ఇక బీజేపీ 1 వార్డు కైవసం చేసుకోగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సున్నాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈనెల పదవ తారీఖున జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో అధికార పార్టీ తన జోరును కొనసాగించనుంది. ఏకగ్రీవ వార్డులలో అత్యధికంగా నాయుడుపేట మున్సిపాలిటీ లో 25 వార్డులకు గాను 20 ఏకగ్రీవాలు చేసి 90% పూర్తి చేసినట్లు అయ్యింది. అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 14వ వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసింది. ఆత్మకూరు మున్సిపాలిటీ ఈ విషయంలో 23 వార్డులకు గాను 6 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వెంకటగిరి మున్సిపాలిటీ లో వైసీపీ మూడు ఏకగ్రీవాలు చేసింది. మొత్తానికి జిల్లాలో 98 వార్డులకు గాను సుమారు 44 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసి మిగిలిన 54 వార్డులకు ఎన్నికలకు వెళ్లనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఒక్క ఏకగ్రీవం కాకపోవడం, బీజేపీకి సులూరుపేట మున్సిపాలిటీలో 1 వార్డు ఏకగ్రీవం చేసుకోవడం జిల్లాలో లో కొసమెరుపు. ఇది ఇలా ఉండగా ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎన్ని వార్డులు గెలుపొందనుందో వేచి చూడాల్సిందే.
Also read:
Tamilnadu Elections: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సంచలన ప్రకటన చేసిన చిన్నమ్మ శశికళ..