తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ పరమ పవిత్రం! ఆ లడ్డూ దొరకడం మహా భాగ్యం! అవును..తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది.. లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా..ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేది లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా.. ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే! విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు..మన ఇంటికి వచ్చేది లడ్డూ రూపంలోనే! లడ్డూ కేవలం ప్రసాదం కాదు..కోట్లాది భక్తుల ఎమోషన్! ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా! ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని నివేదనలు శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికీ, ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డూ ప్రసాదమే! అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే..”తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ..” కలియుగ దైవాన్ని ఆటపట్టించేవాడుట! తిరుమల వైభవం గురించి చెప్పాలంటే..ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే! వరల్డ్ ఫేమస్ శ్రీవారి లడ్డూ ప్రసాదం… ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ బర్నింగ్ టాపిక్ అయ్యింది. గతకొన్ని రోజులుగా నడుస్తున్న లడ్డూ లడాయి… తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్న వేళ.. తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి విషయంలో.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని చెప్పారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తెలిపింది.
కాగా, తిరుపతి లడ్డూకు 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడేవారు. కానీ, 2023లో గత పాలకులు ధరల సమస్యను కారణంగా చూపుతూ నందిని నెయ్యి సప్లై ఆపేశారు. తాజా వివాదంతో తిరుమలకు స్వచ్ఛమైన నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఏపీలోని కూటమి సర్కార్ నిర్ణయించింది.
The Sanctity of Srivari Laddu Prasadam is Restored Again#SrivariLaddu#TirumalaLaddu#LadduPrasadam#TTD#TTDAdministration #TTDevasthanams#OldSuppliers#NewSuppliers#LabReport#Ghee#SValue#GheeQuality pic.twitter.com/1aEhLonqzt
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 21, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..