YS Jagan: జగన్ ఇంటిని తాకిన లడ్డూ లడాయి.. బీజేవైఎం ఆందోళన..

YS Jagan: జగన్ ఇంటిని తాకిన లడ్డూ లడాయి.. బీజేవైఎం ఆందోళన..

Ram Naramaneni

|

Updated on: Sep 22, 2024 | 4:37 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

లడ్డూ లడాయి… తాడేపల్లిలోని జగన్‌ ఇంటిని తాకింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ తాడేపల్లిలోని జగన్‌ ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం నేతలు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ ఇంటి దగ్గర బందోబస్తు పెంచారు.

శ్రీవారి ప్రసాదంపై ప్రభుత్వంది ముమ్మాటికి అసత్య ప్రచారమే అంటూ నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు. జగన్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం స్థాయి మరిచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తే… రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారంటూ భూమన భగ్గుమన్నారు. మొత్తంగా… గతకొన్ని రోజులుగా లడ్డూపై నడుస్తున్న పొలిటికల్‌ ఫైట్‌ పీక్స్‌కి వెళ్లింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..