Kadapa: ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి

కడప జిల్లాలో ఎలక్ట్రిక్‌ స్కూటీ పేలుడు వృద్ధురాలి మరణానికి దారితీసింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఛార్జింగ్‌ అవుతుండగా వాహనం అకస్మాత్తుగా పేలడంతో,..పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) మంటల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విద్యుత్‌ వాహనాల భద్రతపై ప్రశ్నలు రేపింది.

Kadapa: ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి
The Burnt E Scooter (Representative image )

Updated on: Jun 27, 2025 | 9:54 AM

కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్‌ స్కూటీకి ఛార్జింగ్‌కు పెట్టగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీ రాత్రి ఛార్జింగ్‌ కోసం ఉంచారు. అయితే.. ప్రమాదకరంగా వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి.

ఈ సంఘటన ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది. వీటిని సరైన స్థితిలో ఉపయోగించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందనే విషయం మరోసారి స్పష్టమైంది. ఛార్జింగ్‌కు ఉపయోగించిన ప్లగ్‌పాయింట్‌, వాహనంలో ఏదైనా లోపం ఉన్నదా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్‌ టీంను రప్పించారు. వాహనం తయారీ సంస్థకు కూడా సమాచారం పంపినట్లు తెలిపారు.

విధ్వంసకర ఘటనలు జరగకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం అత్యంత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..