Andhra Pradesh: ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త పథకం.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. అప్లై చేసుకోండిలా..

ఏపీలోని పేద విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపికబురు అందించింది. విద్యార్థులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రణం అందిచంనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పథకంతో అనుసంధానం కానుంది. విద్యార్థులకే కేవలం ఒక పోర్టల్ ద్వారా వివిధ బ్యాంకుల్లో ఒకేసారి ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Andhra Pradesh: ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త పథకం.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. అప్లై చేసుకోండిలా..
Students

Updated on: Jan 31, 2026 | 3:59 PM

ఏపీలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు రుణం అందించనుంది. జీరో వడ్డీతో రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం ఒక వెబ్సైట్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థుల వివిధ బ్యాంకుల్లో రుణాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ధిక స్తోమత లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమతున్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులు డబ్బుల్లేక మధ్యలోనే చదువులను ఆపేస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఆర్ధిక పరిస్థితుల వల్ల ఆగిపోతున్నారు. ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.

చంద్రబాబు కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విద్యాలక్ష్మి ద్వారా విద్యార్థులకు పావలా వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని ఏపీలో అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం పావలా వడ్డీని కూడా భరించి వడ్డీ లేని రుణాలు విద్యార్థులకు అందించనుంది. ఈ మేరకు పీఎం విద్యాలక్షి పథకంతో ఏపీ ప్రభుత్వం అనుసంధానం కానుంది. ఈ వెబ్సైట్లో 36కిపైగా బ్యాంకులు రిజిస్టర్ అయ్యాయి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోగానే పరిశీలించి రుణం మంజూరు చేస్తాయి. ఒక విద్యార్థి ఒకేసారి మూడు బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇందులో ఉంది. విద్యార్థులు పోర్టల్ లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకుంటే మొబైల్, ఈమెయిల్ కు ఎప్పటికప్పుడు వివరాలు వస్తాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు ఉండదు. రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.

అర్హతలు

-ఆధార్, పాన్ కార్డ్

-ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు

-కాలేజీ అడ్మిషన్, ఫీజు వివరాలు తెలిపే పత్రాలు

-ఇన్ కమ్ సర్టిఫికేట్

-విద్యార్థి, తల్లిదండ్రుల పాస్ పోర్ట్ సైజు ఫొటోలు

-కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షల్లోపు ఉండాలి

-ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు

-ఒకేసారి మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-Vidyalakshmi Portal పోర్టల్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి

-కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారం నింపాలి

-డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి

-బ్యాంక్ అధికారులు పరిశిలించి రుణం మంజూరు చేస్తారు

-అర్హతను బట్టి రూ.10 లక్షల వరకు పొందవచ్చు