Andhra News: ఫ్లైఓవర్‌పై ఢీకొన్న రెండు కార్లు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

Andhra News: ఫ్లైఓవర్‌పై ఢీకొన్న రెండు కార్లు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

Updated on: Mar 22, 2026 | 11:40 AM

ఎదురెదుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలోపి ఓ ఫ్లైఓవర్‌పై రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ద్వంసమవ్వడంతో పాటు కార్లలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహన దారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి అంబులెన్స్ సహాయంలో హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరగడంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు క్రెయిన్ సహాయంలో రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us